మెదక్ నియోజకవర్గంలో జూలై 15,16న మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

మెదక్ నియోజకవర్గంలో జూలై 15,16న మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలో వాటర్ సప్లయ్ పైప్ లైన్ కు లీకేజ్ ఏర్పడింది. ఈ నెల 15,16న పైప్ లైన్ రిపేర్​చేస్తున్నట్లు ఆదివారం ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరగదని ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.