మిస్టరీ..ఇది ఎవరు దాచిన బంగారం?

మిస్టరీ..ఇది ఎవరు దాచిన బంగారం?

ఒకప్పుడు ధనవంతులు తమ సంపాదనను వాళ్ల వారసుల కోసం దాచేవాళ్లు. పూర్వం బ్యాంకులు లేకపోవడంతో ఇంటిగోడలోనో, పునాదుల్లోనే, పొలాల్లో గోతులు తవ్వి పాతిపెట్టేవాళ్లు. అలా దాచుకున్న బంగారం, లంకె బిందెలే అప్పుడప్పుడు తవ్వకాల్లో బయటపడుతుంటాయి.

మన దగ్గరే కాదు.. అమెరికాలో కూడా అలానే దాచేవాళ్లట! కాకపోతే.. బంగారాన్ని మన దగ్గర లంకెబిందెల్లో నింపితే.. అమెరికాలో టిన్ను(డబ్బా)లు వాడేవాళ్లట. అలాంటి బంగారు నాణేల టిన్​లు ఒక జంటకు వాళ్ల భూమిలో దొరికాయి. 

అమెరికాలోని కాలిఫోర్నియాలో సియెర్రా నెవడా ఒక గ్రామీణ ప్రాంతం. అక్కడ ఉంటారు భార్యాభర్తలు జాన్, మేరీ. తమ పొలానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ప్రతిరోజూ వాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లు. అలాగే 2013 ఫిబ్రవరిలో ఒకరోజు వాళ్ల కుక్కని తీసుకుని వాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లినప్పుడు ఒక చిన్న డబ్బా కనిపించింది. దాని మూత భాగం మాత్రమే పైకి తేలి, మిగతాది భూమిలోపలకు ఉంది.

అదేంటా..! అని తవ్వి బయటికి తీశారు. డబ్బా మొత్తం తుప్పు పట్టి పోయి ఉంది. అందులో పాతకాలం వస్తువులు ఉన్నాయేమో అనుకున్నారు. దాని బరువు చూశాక ‘‘ఇనుము లేదా సీసంతో చేసిన విలువైన వస్తువేదో ఉంది’’ అని జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుకున్నాడు. వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లి మూత తీసి చూస్తే.. డబ్బా నిండా  మెరుస్తున్న బంగారు నాణేలు కనిపించాయి. వాటిని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

వెంటనే ఆ డబ్బాని ఇంట్లో భద్రంగా దాచి, అక్కడ అలాంటి డబ్బాలు ఇంకా ఉన్నాయేమో అని వెతకడానికి వెళ్లారు. ఆ ప్రాంతం అంతా జల్లెడ పట్టారు.  తవ్వించారు. అక్కడ మరో ఎనిమిది బంగారు నాణేల డబ్బాలు దొరికాయి. వాటిలో మొత్తం1,427 బంగారు నాణేలు ఉన్నాయి. ఇప్పటివరకు యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనుగొన్న బంగారు నాణేల అతిపెద్ద నిధి ఇది. అప్పట్లో వాటి విలువ 27,980 అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లుగా అంచనా వేశారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం వాటి విలువ 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే. 

ఎవరివి? 

నిధి దొరికి ఇప్పటికి11 ఏండ్లు గడుస్తున్నా.. ఆ నాణేలు ఎవరివి? అక్కడ ఎందుకు? ఎవరు పాతిపెట్టారు? జాన్ పొలంలోనే ఎందుకు దాచారు? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకలేదు. కానీ.. అవి ఏ కాలానికి చెందినవో గుర్తించగలిగారు. వాటిని1847 నుంచి 1894 మధ్య కాలంలో ముద్రించినట్టు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్తున్నారు. అయితే.. ‘అవి మావే’ అని క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు ఇప్పటివరకు చాలామంది వచ్చారు.

వాళ్లంతా డబ్బుపై ఆశతో వచ్చినవాళ్లే. వాళ్లలో ఒక్కరు కూడా అవి వాళ్ల పూర్వీకులవి అని నిరూపించలేకపోయారు. కావాల్సినంత టైం ఇచ్చినా సరైన ఆధారాలు చూపలేకపోయారు. 

బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దోపిడీ 

శాన్ ఫ్రాన్సిస్కోలో 1901లో ఒక బ్యాంకు(అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో దోపిడీ జరిగింది. బ్యాంకులో పనిచేసే చీఫ్ క్లర్క్ వాల్టర్ డిమ్మిక్ సుమారు 30,000 అమెరికన్ డాలర్ల విలువైన బంగారు నాణేలు దొంగిలించాడని అధికారులు ఆరోపించారు. కానీ.. పోలీసులు ఆ నాణేలను రికవరీ చేయలేకపోయారు. బ్యాంకులో దొంగతనం చేసిన వాల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ నాణేలను అక్కడ పాతిపెట్టి ఉండొచ్చని చాలామంది నమ్ముతారు.

కానీ.. అమెరికా ప్రభుత్వం మాత్రం ఆ నమ్మకాన్ని కొట్టేసింది.  ట్రెజరీ రికార్డుల ప్రకారం.. జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దొరికిన నాణేలు, బ్యాంక్ దోపిడీలో దొంగిలించిన నాణేలకు మధ్య కాస్త తేడా ఉంది. రెండూ ఒకేలా లేవు. పైగా శాన్ ఫ్రాన్సిస్కో మింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దోపిడీపై రెండు పుస్తకాలు రాసిన నాన్సీ ఆలివర్ ప్రకారం.. మింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1847 నుంచి1894ల మధ్య తయారైన నాణేలు లేవు. నాణేల వ్యాపారి డాన్ కాగిన్.. ‘దొరికిన నాణేల్లో కొన్నింటిపై న్యూ ఓర్లీన్స్, ఫిలడెల్ఫియా, కార్సన్ సిటీ.. ఇలా ఇతర మింట్​ల ముద్రలు ఉన్నాయ’ని చెప్పాడు.

మైనింగ్​ చేసి...దాచినవా!

కాలిఫోర్నియా గోల్డ్ రష్ 1848 జనవరి 24 న కాలిఫోర్నియాలోని కొలోమాలో బంగారాన్ని కనుగొన్నప్పుడు మొదలైంది. 1855 వరకు కొనసాగింది. ఆ టైంలో అమెరికాలోని ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి దాదాపు మూడు లక్షల మంది కాలిఫోర్నియాకు వచ్చారు. ఆ టైంలో చాలామంది మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంపాదించుకున్నారు. వాళ్లలో ఎవరో ఒకరు బంగారాన్ని నాణేలుగా మార్చి ఇక్కడ దాచిపెట్టుకున్నారని కొందరు నమ్ముతారు. అధికారులు మాత్రం ఇప్పటికీ ఆ గోల్డ్ కాయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరివో చెప్పలేకపోతున్నారు.