మిథాలీ రాజ్‌‌ అరుదైన ఘనత

మిథాలీ రాజ్‌‌ అరుదైన ఘనత

హామిల్టన్‌‌‌‌: ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌ కెప్టెన్‌‌ మిథాలీ రాజ్‌‌ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. వరల్డ్‌‌కప్‌‌లో అత్యధిక మ్యాచ్‌‌ (24)ల్లో కెప్టెన్‌‌గా వ్యవహరించిన తొలి ప్లేయర్‌‌గా ఈ హైదరాబాదీ రికార్డు సృష్టించింది. ఇందులో 15 విజయాలు, 8 ఓటములు, 1 నో రిజల్ట్​ ఉన్నాయి. గతంలో ఆసీస్‌‌ మాజీ కెప్టెన్‌‌ బెలిండా క్లార్క్‌‌ (23) రికార్డును ఆమె అధిగమించింది. ఇక రెండు అంతకంటే ఎక్కువ వరల్డ్‌‌కప్‌‌ల్లో తమ టీమ్‌‌లను నడిపించిన ఇద్దరు క్రికెటర్లు వీళ్లే కావడం మరో విశేషం.