ఉప్పల్‌‌లో పరుగుల మోత .... ఐపీఎల్‌‌ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన సన్‌‌రైజర్స్‌‌

ఉప్పల్‌‌లో పరుగుల మోత .... ఐపీఎల్‌‌ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన సన్‌‌రైజర్స్‌‌
  •  31 రన్స్‌‌ తేడాతో ముంబై ఇండియన్స్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ
  •   దంచికొట్టిన క్లాసెన్‌‌, హెడ్‌‌, అభిషేక్‌‌, మార్‌‌క్రమ్‌‌

హైదరాబాద్‌ ‌: బౌండ్రీల జోరు... సిక్సర్ల హోరుతో ఉప్పల్‌‌ స్టేడియం ఊగిపోయింది. హెన్రిచ్‌‌ క్లాసెన్‌‌ (34 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 80*), ట్రావిస్‌‌ హెడ్‌‌ (24 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 62), అభిషేక్‌‌ శర్మ (23 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 63), మార్‌‌క్రమ్‌‌ (28 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 42*) సృష్టించిన పరుగుల సునామీలో ముంబై బౌలర్లు కొట్టుకుపోయారు. ఐపీఎల్‌‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన హైదరాబాద్‌‌ బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 31 రన్స్‌‌ తేడాతో ముంబైపై  గెలిచింది. టాస్‌‌ ఓడిన హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 277/3 స్కోరు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 246/5 స్కోరుకే పరిమితమైంది. తిలక్‌‌ వర్మ (64) టాప్‌‌ స్కోరర్‌‌. టిమ్‌‌ డేవిడ్‌‌ (42*), ఇషాన్‌‌ కిషన్‌‌ (34), నమన్‌‌ ధీర్‌‌ (30) ఫర్వాలేదనిపించారు. అభిషేక్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

దంచుడే.. దంచుడు

ఇన్నింగ్స్‌‌ 4వ బాల్‌‌ను ఫోర్‌‌గా మలిచిన హెడ్​.. టిమ్​ డేవిడ్‌‌ క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో బతికిపోయాడు. మయాంక్‌‌ (11) ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చినా ఎక్కువసేపు ఆడలేదు. 3వ ఓవర్‌‌లో హెడ్‌‌ 6, 6, 4, 4తో 22 రన్స్‌‌ దంచాడు. 5వ ఓవర్‌‌లో హార్దిక్‌‌ (1/46).. మయాంక్‌‌ను ఔట్‌‌ చేశాడు. తొలి వికెట్‌‌కు 45 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. ఇదే ఓవర్‌‌లో హెడ్‌‌ హ్యాట్రిక్‌‌ ఫోర్స్‌‌ కొట్టడంతో 13 రన్స్‌‌ వచ్చాయి. ఆరో ఓవర్‌‌లో అభిషేక్‌‌ సిక్స్‌‌తో ఖాతా తెరవగా, హెడ్‌‌ 4, 4, 6తో పవర్‌‌ప్లేలో 81/1 స్కోరు చేసింది. 7వ ఓవర్‌‌లో అభిషేక్‌‌ 6, 6, 6తో 21 రన్స్‌‌ దంచడంతో స్కోరు 100 దాటింది. 18 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన హెడ్‌‌ను 8వ ఓవర్‌‌లో కోయెట్జీ ఔట్‌‌ చేయడంతో రెండో వికెట్‌‌కు 68 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. కొత్తగా వచ్చిన మార్‌‌క్రమ్‌‌ 4, 6తో చెలరేగాడు. 10 ఓవర్‌‌లో అభిషేక్‌‌ 4, 6, 6, 4తో 16 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ అందుకోవడంతో రైజర్స్‌‌ స్కోరు 148/2కు పెరిగింది. తర్వాతి ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టి అభిషేక్‌‌ వెనుదిరగడంతో మూడో వికెట్‌‌కు 48 రన్స్‌‌ జతయ్యాయి. ఇక మార్‌‌క్రమ్‌‌తో కలిసి క్లాసెన్‌‌ హిట్టింగ్‌‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. తర్వాతి 5 ఓవర్లలో 54 రన్స్‌‌ రావడంతో స్కోరు 202/3కి చేరింది. 17వ ఓవర్‌‌లో క్లాసెన్‌‌ 4, 6, మార్‌‌క్రమ్‌‌ 4 కొట్టారు. తర్వాతి ఓవర్‌‌లో సిక్స్‌‌తో క్లాసెన్‌‌ 23 బాల్స్‌‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. 19వ ఓవర్‌‌లో 2 ఫోర్లు, లాస్ట్‌‌ ఓవర్‌‌లో 4, 6, 6 బాదడంతో నాలుగో వికెట్‌‌కు 116 రన్స్‌‌ సమకూరాయి. 

తిలక్‌‌ దంచినా..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌ను ముంబై కూడా దీటుగానే మొదలుపెట్టింది. రోహిత్‌‌ (26) 4, 6, 6 బాదితే, ఇషాన్‌‌ 4, 4, 6, 6, 6, 6 దంచాడు. కానీ 4వ ఓవర్‌‌లోనే షాబాజ్‌‌ (1/39)కు వికెట్‌‌ ఇవ్వడంతో తొలి వికెట్‌‌కు 56 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఐదో ఓవర్‌‌లో కమిన్స్‌‌ బౌలింగ్‌‌లో సిక్స్‌‌ కొట్టిన రోహిత్‌‌ తర్వాతి బాల్‌‌కే వెనుదిరిగాడు. తిలక్‌‌, నమన్‌‌ అండతో ముంబై పవర్‌‌ప్లేలో 76/2 స్కోరు చేసింది. 7వ ఓవర్‌‌లో ఈ ఇద్దరు చెరో సిక్స్‌‌తో 15 రన్స్‌‌ రాబట్టారు. ఆ వెంటనే తిలక్‌‌ 6, 4, నమన్‌‌ 6తో రెచ్చిపోయారు. 10వ ఓవర్‌‌లో తిలక్‌‌ మూడు సిక్స్‌‌లు బాదడంతో ముంబై 141/2తో నిలిచింది. 11వ ఓవర్‌‌లో ఉనాద్కట్‌‌ (2/47) ఈ జోడీని విడదీశాడు. 
ఈ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టిన నమన్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను కవర్స్‌‌లో కమి న్స్‌‌ అందుకున్నాడు. మూడో వికెట్‌‌కు 84 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 12వ ఓవర్‌‌లో హార్దిక్‌‌ (24) 6, 4 టచ్‌‌లోకి వచ్చాడు. 24 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టిన తిలక్‌‌14వ ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టి తర్వాతి ఓవర్‌‌లో వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. దీంతో నాలుగో వికెట్‌‌కు 32 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. ఓవరాల్‌‌గా 15 ఓవర్లలో 185/4 స్కోరు చేసిన ముంబైకి చివరి 30 బాల్స్‌‌లో 90 రన్స్‌‌ అవసరమయ్యాయి.16వ ఓవర్‌‌లో 5 రన్సే వచ్చినా, తర్వాతి ఓవర్లలో  డేవిడ్‌‌ 6, 4, 6, 4, 6 దంచాడు. కానీ హార్దిక్‌‌ ఔట్‌‌కావడంతో సమీకరణం 12 బాల్స్‌‌లో 54గా మారింది. షెఫర్డ్‌‌ (15*) 6, 4, 4 కొట్టినా ముంబై టార్గెట్‌‌ను అందుకోలేకపోయింది. 

సంక్షిప్త స్కోర్లు

హైదరాబాద్‌‌: 20 ఓవర్లలో 277/3 (క్లాసెన్‌‌ 80*, అభిషేక్‌‌ 63, హెడ్‌‌ 62, మార్‌‌క్రమ్‌‌ 42*, చావ్లా 1/34). ముంబై:20 ఓవర్లలో 246/5 (తిలక్‌‌ వర్మ 64, టిమ్‌‌ డేవిడ్‌‌ 42*, ఇషాన్‌‌ 34, జైదేవ్‌‌ 2/47, కమిన్స్‌‌ 2/35). 

మరిన్ని వార్తలు