వ్యాక్సినేష‌న్ లో పొర‌పాటు.. 20 మందికి వేర్వేరు డోస్ లు

వ్యాక్సినేష‌న్ లో పొర‌పాటు.. 20 మందికి వేర్వేరు డోస్ లు

ఉత్త‌ర్ ప్ర‌దేశ్: వ్యాక్సినేష‌న్ లో కొంత మందికి రెండు వేర్వ‌రు డోస్ లు వేసిన సంఘ‌ట‌న బుధ‌వారం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో జ‌రిగింది. మొద‌టిసారి ఏ వ్యాక్సిన్ వేసుకుంటే ..రెండోసారి కూడా అదే డోస్ వేసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించిన విష‌యం తెలిసిందే. అయితే వైద్యాధికారుల పొర‌పాటుతొ యూపీలోని, సిద్ధార్ధ్ న‌గ‌ర్ జిల్లా ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ లో ఓ గ్రామానికి చెందిన‌ 20 మందికి ఒకసారి కోవిషీల్డ్, ఇంకోసారి కొవాగ్జిన్ డోస్ వేశారు. మామూలుగా అయితే తొలి డోస్ ఏ టీకా తీసుకుంటే .. రెండో డోస్‌ కూడా అదే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించిన విష‌యం తెలిసిందే.

 అయితే గ్రామంలోని కొందరికి తొలి డోస్ ఏప్రిల్ మొదటి వారంలో కోవిషీల్డ్ ఇచ్చారు. మే 14న వీరికి రెండో డోస్‌ కొవాగ్జిన్ ఇచ్చినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, వారికి ఎటువంటి దుష్పరిణామాలు, అనారోగ్య సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్.. ఇది ఖచ్చితంగా పొరపాటే.. వ్యాక్సిన్లు కలిపి ఇవ్వాలని యంత్రాంగానికి ప్రభుత్వ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు.. కాబట్టి, ఇది పొరపాటున జరిగిందన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి నివేదిక కోరాం.. ఈ నిర్వాకం చేసినవారికి వివరణ కోరాం.. దీనిపై వీలైనంత వరకు చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ సంఘ‌ట‌న‌ పొరపాటున జరిగిందంటూ వైద్యాధికారులు చేతులు దులుపుకోవడం గమనార్హం.