నిండు చూలాలికి పురుడు పోసిన స్థానిక ఎమ్మెల్యే

నిండు చూలాలికి పురుడు పోసిన స్థానిక ఎమ్మెల్యే

నెలలు నిండి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు స్థానిక ఎమ్మెల్యే పురుడు పోశాడు. ఈ ఘటన మిజోరంలోని ఛాంపై జిల్లాలో జరిగింది. ఛాంపై నార్త్‌ ఎమ్మెల్యే జెడ్ఆర్ థియామ్‌సంగ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. ఇటీవల కాలంలో అక్కడ భూకంపాలు సంభవించాయి. కరోనా వైరస్ కూడా తీవ్రమవుతోంది. దాంతో తన నియోజకవర్గ ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవడానికి ఆయన సోమవారం పర్యటించారు.

నియోజకవర్గంలో అలా పర్యటిస్తున్న క్రమంలో.. ఎన్‌గూర్ గ్రామానికి చెందిన లాల్‌మంగైహ్సంగి అనే నిండు గర్భవతి తీవ్ర నొప్పులతో బాధపడుతుంది. అది తెలిసిన ఎమ్మెల్యే వెంటనే ఆమెకు పురుడు పోశాడు. వృత్తరీత్యా ప్రసూతి డాక్టర్ అయిన ఎమ్మెల్యే సమయానికి పురుడు పోయడంతో తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. అక్కడి స్థానిక డాక్టర్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్ కు రాలేదు. పైగా ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే దాదాపు 200 కిలోమీటర్లు వెళ్లాలి. అంతదూరం వెళ్లే ఓపిక, అంత సమయం కూడా ఆమెకు లేదు. దాంతో ఎమ్మెల్యేనే డాక్టర్ గా మారాడు. ఇలా చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎమ్మెల్యే ఒక నదిని దాటి.. భారత్-మయన్మార్ సరిహద్దులో కాపలాగా ఉన్న సిబ్బందికి ఆరోగ్యం బాలేకపోవడంతో కొన్ని కిలోమీటర్లు నడిచి చికిత్స అందించారు.

థియామ్‌సంగ 2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ తరపున పోటీ చేసి.. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్ సంగను ఓడించారు. థియామ్‌సంగ ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ బోర్డుకు వైస్ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు.

For More News..

రాష్ట్రంలో కొత్తగా 1897 కరోనా కేసులు

తండ్రి చనిపోతే.. బిడ్డకు.. బిడ్డ చనిపోతే.. ఆమె పిల్లలకు ఆస్తిలో వాటా

టాప్ టెన్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ విడుదల.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు..