మిజోరంలో క్వారీ కూలి 10 మంది మృతి

మిజోరంలో క్వారీ కూలి 10 మంది మృతి

రెమల్ తుపాన్ కారణంగా వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వచ్చాయి. మంగళవారం (మే28న) ఈ తుపాన్ తీరం దాటింది. పోతు పోతూ మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్ లో రెమల్ విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ సిటీకి దక్షాణాన ఉన్న మెల్తుమ్, హ్లిమెన్ ల సరిహద్దులోని రాళ్ల క్వారీ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది గనిలో చిక్కుకోని ప్రాణాలు కోల్పోయారు. చుట్టుపక్కలున్న ఇళ్లు కూడా ధ్వంసమైయ్యాయి. ఈ ప్రమాదం ఈరోజు ఉదయం 6 గంటలకు జరిగింది. 

గని శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు. అయినపట్టికీ చాలామంది ఇంకా కూలిపోయిన రాళ్ల క్వారీలో ఉన్నారు. వాళ్ల కోసం పోలీసులు, రెస్క్యూ టీంలు రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్లనే ఇలా జరిగిందని స్థానికులు అనుకుంటున్నారు. హెవీ రేన్స్ కారణంగా కొండచర్యలు కూడా విరిగిపడ్డాయి. చనిపోయిన వారిలో ముగ్గురు మిజోలు కాని వారు ఉన్నారు.