స్టూడెంట్స్​ను చితకబాదిన గెస్ట్​ పీఈటీ.. స్టూడెంట్స్​ను చితకబాదిన గెస్ట్​ పీఈటీ

స్టూడెంట్స్​ను చితకబాదిన గెస్ట్​ పీఈటీ.. స్టూడెంట్స్​ను చితకబాదిన గెస్ట్​ పీఈటీ

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్​ స్కూల్​లో విద్యార్థినులను పీఈటీ ఐరన్​స్కేల్​తో చితకబాదింది. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాలు కురుస్తుండడంతో మూడు రోజులు సెలవులు వచ్చాయి. ప్రిన్సిపాల్​ది హైదరాబాద్​ కావడంతో ఆమె లీవ్​లో వెళ్లారు. మొహర్రం పండుగ సందర్భంగా శనివారం ఉదయం పీరీలు స్కూల్​ ముందు నుంచి వెళ్తుండగా, వాటిని చూసేందుకు విద్యార్థినులు అంతా బయటికి వచ్చారు. అంతకుముందే గెస్ట్​ పీఈటీ శివమ్మ మిద్దెపై ఆరబెట్టుకున్న బట్టలు తెచ్చుకోమని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు పట్టించుకోకుండా పిల్లలంతా పీరీలను చూడడానికి గేట్ వద్దకు రావడంతో, ఐరన్​స్కేల్​తో అందరినీ కొట్టింది. 

ఇందులో మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండలం రామన్నపల్లికి చెందిన ఆరో తరగతి స్టూడెంట్​వర్షలతకు వీపుపై కంది పోయింది. టీచర్​ కొట్టిన విషయాన్ని స్టూడెంట్స్​ స్కూలు దగ్గరకు వచ్చిన మీడియాకు వివరించారు. దాంతో విలేకరులు ప్రిన్సిపాల్​ స్వర్ణలతను ఫోన్​లో సంప్రదించగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా​కన్వీనర్​ మదనాచారికి ఈ విషయం తెలపడంతో గెస్ట్​ పీఈటీ శివమ్మను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.