రోడ్డు కోసం ఎమ్మెల్యే నిలదీత : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

రోడ్డు కోసం ఎమ్మెల్యే నిలదీత : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

చిన్నచింతకుంట, వెలుగు: శంకుస్థాపన చేసి రెండేండ్లయినా ఉంద్యాల బీటీ రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదని గ్రామస్తులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని నిలదీశారు. సోమవారం జూరాల నుంచి కోయిల్ సాగర్ కు తాగునీటికై ఉంద్యాల పంపుహౌస్  ఫేజ్–1 ద్వారా నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. 

మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకు వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు మంజూరు చేసేంత వరకే తనవంతు అని,ఆ తర్వాత విషయం తనకు తెలియదని చెప్పారు. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడంతో గ్రామస్తులు విస్తుపోయారు.