
- ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, వెలుగు : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో పెల్లిపాకుల కెనాల్ లో ముంపునకు గురవుతున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల కండ్లలో ఆనందం చూసేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలంలోని కొండ భీమనపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు.
రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అనంతరం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మండల ఎఫ్ఎల్ఎం, టీఎల్ఎం మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నల్గొండ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, పీఏసీఎస్చైర్మన్ వేణుధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.