జడ్చర్ల–-కోదాడ హైవే విస్తరణ పనుల్లో వేగం పెంచండి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

జడ్చర్ల–-కోదాడ హైవే విస్తరణ పనుల్లో వేగం పెంచండి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని జడ్చర్ల–-కోదాడ హైవే విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో  కలిసి రోడ్డు విస్తరణకు వేసిన మార్క్ ను పరిశీలించారు. ఇండ్లు కోల్పోయిన వారికి రూ. 33 కోట్లు అందించినట్లు తెలిపారు. 

భూ వారసత్వ వివాదాల కారణంగా పెండింగ్ ఉన్న రూ.6 కోట్లను త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదుట అంబేద్కర్ భవనం కోసం గుర్తించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి, వాటర్ ఫౌంటెయిన్​నిర్మిస్తామని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ.. పరిహారం పొందిన భవనాల యజమానులు ఆర్అండ్ బీ  నిబంధనల మేరకు భవనాలు తొలగించుకొని మున్సిపల్ శాఖ నిబంధనల మేరకు సెట్ బ్యాక్ వదిలి కొత్త నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ సురేశ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ఐ ఠాకూర్ రామకృష్ణ, సర్వేయర్ ఖాదిర్ ఉన్నారు.