
- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : సామాన్యుల భవిష్యత్మార్చే ఆయుధం విద్య మాత్రమేనని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం దామరచర్ల మండల కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించిన కస్తూర్బా బాలికల విద్యాలయం, కళాశాల అదనపు భవనాల సముదాయాన్ని స్థానిక నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గురుకులాల్లో కాస్మొటిక్స్ చార్జీలు పెంచిందన్నారు. పేదల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం కోసం ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం కల్పించే వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కస్తూర్బా పాఠశాల ఆవరణలో స్థానికులు, విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన భోజనం చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.