
- ఇప్పటికే అండర్ గ్రౌండ్,
- వాటర్ సప్లై పనులు ప్రారంభం
- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు ప్రస్తుతం మిర్యాలగూడ మున్సిపాలిటీకి అవసరమైన సదుపాయాల కల్పనకు రూ. 390 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చెప్పారు. సోమవారం 6.60 కోట్లతో చేపట్టనున్న మిర్యాలగూడ పట్టణంలోని చిన్న(అప్పలమ్మ), పెద్ద( పందిళ్ల పల్లి) చెరువుల మరమ్మతు పనులకు స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రూ. 93 కోట్లతో వాటర్ సప్లై పనులు, 171 కోట్లతో 136 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ. 20 కోట్లతో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. 99 కోట్లతో డ్రైనేజీ కాల్వల నిర్మాణం, సీసీ రోడ్లు, టాకా రోడ్డు వెడల్పు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. సుమారు రూ. 390 కోట్లతో చేపట్టనున్న పనుల్లో మేజర్ పనులు ప్రారంభమై కొనసాగుతున్నట్లు చెప్పారు. పనులను క్వాలిటీతో పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చిలుకూరి బాలకృష్ణ, మేకల శ్రీనివాస్, గోదాల జానకి రాంరెడ్డి, , గంధం రామకృష్ణ తదితరులు ఉన్నారు.