ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుందాం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుందాం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బొజ్జు పటేల్ అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ఆయన జన్నారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో శ్రమదానం చేసి చెత్తను తొలగించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవన్నారు.

  మహాత్మా గాంధీ, డాక్డర్ బీఆర్ అంబేద్కర్ కలలుగన్న భారత దేశ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో శిక్షణ శిబిరం నిర్వహకులు రాణాప్రతాప్, మల్లేశ్వరి, జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, నాయకులు సయ్యద్ ఇసాక్, మోహన్ రెడ్డి, మాణిక్యం, ఇందయ్య, డి.రమేశ్, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.