రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  •  కడెం ఎడమ కాలువకు నీటి విడుదల

కడెం, వెలుగు: రైతుల నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్​ సూచించారు. కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు మంగళవారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు రిపేర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.46 కోట్లు ఖర్చు చేసిందన్నారు. త్వరలో పూడికను తొలిగిస్తామని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద సెప్టిక్ ట్యాంక్ పనులకు, నచ్చన్ ఎల్లాపూర్​లోని గురుకుల పాఠశాలలో సోలార్ ఫెన్సింగ్ పనులకు భూమి పూజ చేశారు. 

అంతకుముందు ఉదయం ‘పొద్దుపొడుపు బొజ్జన్న’ పేరుతో కడెం మండల కేంద్రంతో పాటు పెద్దూరులో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్ఈ రవీందర్, ఈఈ విఠల్, డీఈ నవీన్, జేఈలు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, తుమ్మల మల్లేశ్, సతీశ్ రెడ్డి, బి.రమేశ్, జె.చంద్రశేఖర్, తరి శంకర్, బి.గంగన్న, ఎ.లచ్చన్న,ఎం.మల్లేశ్, వాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు వడ్డీ లేని రుణాలందిస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ, వారికి వడ్డీ లేని రుణాలు అందిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కడెం రైతు వేదికలో ఇందిరా మహిళ శక్తి సంబురాలు కార్యక్రమంలో చీఫ్​గెస్ట్​గా పాల్గొన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రజా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అనంతరం మహిళలకు స్త్రీనిధి పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీపీవో శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ ​నాయకులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పెంబి, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం పెంబిలోని రైతు వేదికలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేదల ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో కల్యాణలక్ష్మి స్కీమ్​ అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్​తో పాటు మందపల్లిలోని కేబీబీవీ స్కూల్​లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు సల్ల స్వప్నిల్ రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, డిప్యుటీ తహసీల్దార్ శంకర్, నాయకులు తులాల శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.