దళిత బంధు ఇచ్చినోళ్లకు డబుల్​ బెడ్ రూం ఇళ్లివ్వం: చల్లా ధర్మారెడ్డి

దళిత బంధు ఇచ్చినోళ్లకు డబుల్​ బెడ్ రూం ఇళ్లివ్వం: చల్లా ధర్మారెడ్డి

దళిత బంధు ఇచ్చినోళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వమంటూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామంలో.. 20లక్షలతో నూతన మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు విమర్శలు చేస్తున్నాయి.  

దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లకు లింకు పెట్టడం ఏంటని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే దళిత బంధు కావాలి అనుకున్నవాళ్లు డబుల్ బెడ్ రూం ఇళ్లు అడగవద్దంటూ చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.