అమ్రాబాద్, వెలుగు: నల్లమల టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో డెవలప్మెంట్ ప్రపోజల్స్ చేపట్టాలని సీఎంవో నుంచి సర్క్యులర్ జారీ అయిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నల్లమల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని పర్యాటక కేంద్రాలు, నల్లమల ఆలయాలను కలుపుతూ టూరిజం హబ్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
