కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి, వెలుగు: కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్టీ శ్రేణులకు వివరించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యేలు ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, పార్టీ ముఖ్య నేతలు తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. 

కాళేశ్వరంపై వాస్తవాలను హరీశ్ రావు రాష్ట్రానికి , దేశానికి కూలంకుషంగా వివరించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాకముందే కావాలనే కరెంట్ కట్ చేశారని ఆరోపించారు . కేసీఆర్ మీద కక్ష సాధింపులో భాగంగా కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. రైతులకు మంచి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్​రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చింతా సాయినాథ్, బుచ్చిరెడ్డి, జీవి శ్రీనివాస్, వీరేశం, ముభిన్, విఠల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం సిగ్గుచేటు

సంగారెడ్డి టౌన్: తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలను తెలియజేసే బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ప్రావీణ్యకు అందజేశారు. వారు మాట్లాడుతూ 2015లో అప్పటి మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, బాబు మోహన్, చింతా ప్రభాకర్ నాటి కలెక్టర్ రాహుల్ బొజ్జ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టరేట్​లో ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. వినతిపత్రం అందజేసిన వాళ్లలో నాయకులు జీవి శ్రీనివాస్, చింత సాయి, విటల్ ఉన్నారు.