పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవడం దారుణం : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవడం దారుణం : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గురువారం కలెక్టర్  ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కొండాపూర్ మండలం మాందాపూర్, మునిదేవుని పల్లి గ్రామాల్లో పరిశ్రమల పేరుతో రైతులు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తోందని ఆరోపించారు. 

అలియాబాద్ తొగర్ పల్లి గ్రామాల శివారులోనూ 43 ఎకరాలు రైతులకు సమాచారం ఇవ్వకుండా ముందస్తు పొజిషన్ తీసుకున్నారని, అక్కడ భూమి విలువ సుమారు రెండున్నర కోట్లు ఉందని అయినప్పటికీ రైతులకు పరిహారం నిర్ధారణ చేయలేదన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్ ఉన్నారు..