- ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, వెలుగు : అధికారులు అంకితభావంతో పని చేసి ఇందూరు నగర అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. శనివారం నగరంలోని తన ఆఫీస్‌లో మున్సిపల్ శాఖలోని పబ్లిక్‌హెల్త్, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. అమృత్ పథకం ద్వారా చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మ్యాన్‌హోల్స్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి డివిజన్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రామర్తి చెరువు సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. వీటితో పాటు ప్రజారోగ్యం, తాగునీరు, మురుగునీటి వ్యవస్థ తదితర అంశాల్లో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.
