మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి

నెక్కొండ, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి అన్నారు. శనివారం వరంగల్​జిల్లా నెక్కొండ మండలం ధీక్షకుంటలో ఆయన మహిళా కమ్యూనిటీహాల్​ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళాశక్తి పథకంలో భాగంగా ప్రతి మహిళా సంఘానికి రూ.20 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు.  

కీర్తన, కావ్య, ఇందిరా గ్రూపులకు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల బ్యాంకు లింకేజీ రుణం శాంక్షన్ కాపీని మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో టీసీసీసీ సభ్యులు రంజిత్ రెడ్డి, మార్కెట్​కమిటీ చైర్మన్లు రావుల హరీశ్​రెడ్డి, పాల్వయి శ్రీనివాస్ తదితరులున్నారు నెక్కొండ మండలం ధీక్షకుంటలో  మహిళా కమ్యూనిటీహాల్​ను ప్రారంభించారు ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి