
అచ్చంపేట, వెలుగు : విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం బల్మూర్, అచ్చంపేట ఐసీడీఎస్ప్రాజెక్టుల ఆధ్వర్యంలో రామ్ నగర్, రంగాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంగన్ వాడీ టీచర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నవజాత శిశువులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందజేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు. అనంతరం బలమూరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో రాఘవులు, ఎలక్ట్రిసిటీ ఏడీ ఆంజనేయులు, సీడీపీవో దమయంతి, నాయకులు వెంకట్ రెడ్డి, శ్రీపతిరావు, మోహన్ రెడ్డి, కాశన్న యాదవ్, శ్రీనివాసులు, మశన్న, రమేశ్, లింగమ్మ, నాయక్ చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.