
చిన్న చింతకుంట, వెలుగు: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఆదివారం కురుమూర్తి స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం దేవరకద్రలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
398 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మెగా మెడికల్ హెల్త్ క్యాంప్‌లో 1,174 మందికి గుండె, ఆర్థోపెడిక్, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేకు చికిత్స పొందిన వారు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.