మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటించి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. అమృత్ 2.0 పథకం ద్వారా బెల్లంపల్లిలో తాగునీటిని సరఫరా చేసేందుకు 61.50 కోట్లను కేటాయించామని తెలిపారు. అలాగే కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ దగ్గర భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిథులు, కలెక్టర్ కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.