
బెల్లంపల్లి, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, వి.హనుమంతరావు తదితరులతో కలిసి ఎమ్మెల్యే వినోద్ ధర్నా చేశారు.
ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలను న్యాయంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్తి పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.