స్టూడెంట్స్​కు నులిపురుగుల మాత్రలు వేసిన ఎమ్మెల్యే

స్టూడెంట్స్​కు నులిపురుగుల మాత్రలు వేసిన ఎమ్మెల్యే

శివ్వంపేట, వెలుగు: జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం శివ్వంపేట మండలం గూడూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి  విద్యార్థినులకు  నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఏడాదిలో రెండు సార్లు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ.  జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్ అలీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, నాయకులు యాద గౌడ్, హనుమంతు, టీచర్లు పాల్గొన్నారు.