కారు ఆపిన పోలీసులను తిట్టిన ఎమ్మెల్యే గువ్వల

కారు ఆపిన పోలీసులను తిట్టిన ఎమ్మెల్యే గువ్వల

బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులపై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నోరు పారేసుకున్నారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తల్లి సమాధి వద్దకు వెళ్లేందుకు కేవలం సీఎం వెహికల్​కే పోలీసులు అనుమతి ఇచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన పార్కింగ్ స్థలంలో వెహికల్స్ ఆపి, అక్కడి నుంచి సమాధి వద్దకు నడుచుకుంటూ పోవాల్సి ఉంది. అయితే అప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ తన వెహికల్​లో సమాధి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే బాలరాజు కూడా తన వెహికల్​లో సమాధి వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. కానీ వారు నిరాకరించారు. బారికేడ్లను అడ్డు పెట్టడంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం చేస్తార్రా’ అంటూ  పోలీసులను సంబోధించారు. దీంతో పోలీసులు మర్యాదగా మాట్లాడాలని, ఎమ్మెల్యే అయినంత మాత్రాన రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని సూచించారు. కొందరు అధికారులు, నాయకులు ఎమ్మెల్యేకు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. చివరకు కాలి నడకనే సమాధి వద్దకు వెళ్లారు. రెండు రోజుల కింద బీజేపీ కార్యకర్త మీద సైతం ఎమ్మెల్యే ఇలానే నోరు పారేసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పదవికి రాజీనామా చేస్తానని అన్నారుగా.. ఎప్పుడు చేస్తారని వనపర్తి జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త గువ్వలకు ఫోన్ చేసి అడిగారు. దీంతో కార్యకర్తను ఎమ్మెల్యే బూతులు తిట్టారు.