
అల్లు అర్జున్ ( Allu Arjun ) ఈ పేరు వింటే చాలు చాలు అభిమానులకు పూనకాలే. నటన, డ్యాన్స్, స్టైల్, స్వ్యాగ్.. ఇలా ప్రతీ విషయంలోనూ తనదైన ముద్రవేసుకున్నారు . తాజాగా తన మాటలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు ఈ ఐకాన్ స్టార్. అమెరికాలోని టాంపా వేదికగా జరిగిన 'నాట్స్ 2025' ( ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ ) 8వ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్, శ్రీలీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ మాట్లాడుతూ.. తెలుగువారు ఎక్కడ ఉన్నా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడ మన తెలుగువారిని చూస్తుంటే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్లే అనిపిస్తుందన్నారు.
'తెలుగువారంటే.. ఫైర్ అనుకుంటున్నారా.. వైల్డ్ ఫైర్'
ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నాట్స్ సంస్థకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్!” అని హాస్యంగా నాట్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు . అటు పుష్ప స్టైల్ లో డైలాగ్ చెప్పి అందరిని అలరించారు. 'తెలుగువారంటే.. ఫైర్ అనుకుంటున్నారా.. వైల్డ్ ఫైర్' అంటూ డైలాగ్ చెప్పడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా అభిమానుల ఈలలు, కేరింతలతో మార్మోగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది.
►ALSO READ | OTT Movies: ఓటీటీ వీకెండ్ స్పెషల్.. డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, సిరీస్లు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, “అడవి రాముడు చిత్రంలో అడవిని నమ్మి స్టార్ డైరెక్టర్ అయ్యాను. సుకుమార్ ‘పుష్ప’లో అడవిని నమ్మి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అల్లు అర్జున్‌ను స్టార్ హీరోగా తీర్చిదిద్దాడు” అని అన్నారు. ఇద్దరం అడివిని నమ్ముకుని స్టార్ డమ్ సొంతం చేసుకున్నామని గుర్తుచేశారు. సుకుమార్ మాట్లాడుతూ, “అమెరికాలోని తెలుగు ప్రజలు ‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని ఆదరించడంతో నాకు మరో సినిమా అవకాశం వచ్చింది. అలాగే నవీన్‌ను నిర్మాతగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పించింది” అని తెలిపారు. అటు ఈకార్యక్రమంలో శ్రీలీల తన డ్యాన్స్ తో, దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరితో అలరించారు..