
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చలనం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. ముందు చూపులేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. గురువారం నల్గొండలోని బీఆర్ఎస్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం రైతులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు.
నల్గొండ లో పరిస్థితి దారుణంగా ఉందని, మంత్రి కోమటిరెడ్డి ఎక్కడికి పోయి టైంపాస్ చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రైతులకు యూరియా అందించే సోయి కూడా మంత్రికి లేదని విమర్శించారు. రైతులకు యూరియా అందించని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, నేతలు మందడి సైదిరెడ్డి, కటికం సత్తయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.