టెక్నాలజీపై స్టూడెంట్స్​ పట్టు సాధించాలి : జారే ఆదినారాయణ

టెక్నాలజీపై స్టూడెంట్స్​ పట్టు సాధించాలి : జారే ఆదినారాయణ

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : నేటి సమాజంలో స్టూడెంట్లు ఆధునిక సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించాలని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. బుధవారం అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఫ్లో (ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ )  పై  స్టూడెంట్స్  కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు ఆడాలని, జనరల్ నాలెడ్జ్ ను పెంచుకోవాలని సూచించారు.

Also Read : హైదరాబాద్ రాజ్యంలో తొలి తరం ప్రముఖులు వీరే

సాంకేతిక విజ్ఞానం పెంపొందితే భవిష్యత్ లో లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు.  ప్రత్యేక బస్సు లో ఏర్పాటు చేసిన ఫ్లో  సాంకేతిక  ప్రదర్శనలను మండలంలోని  ప్రభుత్వ  స్కూల్స్ లోని 8 నుంచి10, ఇంటర్  స్టూడెంట్ల కు అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో ఫ్లో బృంద సభ్యులు  మధులాష్, పవన్ కుమార్, రోహిత్, సాయి వర్ధన్ , చైత్ర, తహసీల్దారు జగదీశ్వర ప్రసాద్, ఎంపీడీవో మహాలక్ష్మి, పర్సా వెంకట్, వనమా గాంధీ, తదితరులు పాల్గొన్నారు.