కోరుట్ల నియోజకవర్గంలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి : కోరుట్ల ఎమ్మెల్యే కె.సంజయ్

కోరుట్ల నియోజకవర్గంలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి : కోరుట్ల ఎమ్మెల్యే కె.సంజయ్

మెట్‌‌పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అధికారులకు సూచించారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్‌‌‌‌ గ్రిడ్‌‌ను పరిశీలించి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మెట్‌‌పల్లి ఎంపీడీవో ఆఫీసులో అధికారులతో రివ్యూ చేశారు. మండలంలోని  చాలా గ్రామాలకు భగీరథ నీళ్లు అందడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో  ఎంపీడీఓ మహేశ్వర్ రెడ్డి, ఆర్డబ్లూఎస్  డీఈ  ఆనంద్, పంచాయతీరాజ్ డిఈ. రమణరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మల్లాపూర్, వెలుగు: మల్లాపూర్ ఎంపీడీవో ఆఫీసులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ , సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజయ్‌‌కుమార్‌‌‌‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లీడర్స్ ఆదిరెడ్డి, రమేశ్‌‌రెడ్డి, లింగుస్వామి, శరత్, లక్ష్మణ్ పాల్గొన్నారు.