
ధర్మసాగర్ (వేలేరు), వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని లబ్ధిదారులకు శనివారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ధర్మసాగర్ మండలానికి 924 కొత్తకార్డులు రాగా, 2119 ఫ్యామిలీ మెంబర్స్పేర్లు చేర్చారు. వేలేరు మండలానికి 552 కార్డులు రాగా, 1195 ఫ్యామిలీ మెంబర్స్పేర్లు చేర్చారు.
కొత్త కార్డులను ఆయా మండలాల్లోని రైతు వేదికల్లో ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. వేలేరు మండలానికి చెందిన 9 మంది, ధర్మసాగర్ మండలానికి చెందిన 17 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సదానందం, కొమి, ఎంపీడీవోలు అనిల్‌కుమార్, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.