ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్​ చేసి స్టేషన్​ఘన్​పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్​ వన్​ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​తో కలిసి కలెక్టరేట్​లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 మండలాలకు మొత్తంగా 3500 ఇండ్లు కేటాయించగా, జనగామ జిల్లాలోని 5 మండలాల్లో 2486, హనుమకొండ జిల్లాలోని రెండు మండలాల్లో 1014 ఇండ్లు మంజూరయ్యాయన్నారు.

 ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయవద్దన్నారు. వచ్చే నెల 3 వరకు క్షేత్ర స్థాయి నివేదిక అందించాలన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు పింకేశ్​కుమార్, రోహిత్ సింగ్, ఆర్డీవో వెంకన్న, జనగామ, హనుమకొండ హౌసింగ్ పీడీలు తదితరులు పాల్గొన్నారు. 

టీబీ రహిత జిల్లా కోసం కృషి చేయాలి

జనగామ అర్బన్: టీబీ రహిత జిల్లా కోసం కృషి చేయాలని, న్యూట్రిషన్​ కిట్​మంచి పోషకాహారం అని జనగామ కలెక్టర్​రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. టీబీ ముక్త్​ భారత్​ అభియాన్​లో భాగంగా సోమవారం ఐఎంఏ సహాకారంతో జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టని కార్యక్రమంలో కలెక్టర్​ 50 మంది క్షయ వ్యాధి రోగులకు ఉచిత న్యూట్రిషన్​కిట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో మల్లికార్జున్​రావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్​ బాలాజీ, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.