
లక్సెట్టిపేట వెలుగు: అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం లక్సెట్టిపేటలోని ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. వానాకాలంలో ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా మూడు నెలలకు సరిపడా రేషన్ ఒకేసారి ఇచ్చామన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. తహసీల్దార్ దిలీప్ కుమార్, అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.