ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా‌‌‌‌ : కూనంనేని సాంబశివరావు 

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా‌‌‌‌ : కూనంనేని సాంబశివరావు 

పాల్వంచ రూరల్, వెలుగు : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం మండలపరిధిలోని సారేకల్లు, కార్యగట్టు, కోడిపుంజులవాగు,  పూసలతండా, నాగారం కాలనీల్లో ఆయన పర్యటించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్లలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.

ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల కోడ్​ అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. ఆయన వెంట డీసీఎంఎస్​ చైర్మన్​ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కే సాబీర్​పాషా, రాష్ట్రసమితి సభ్యులు ముత్యాల విశ్వనాధం, కాంగ్రెస్​ జిల్లా నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, డీ.సుధాకర్, శనిగరపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.