
హాలియా, వెలుగు: ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డును అందజేస్తామని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన రేషన్ షాపును ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్న సన్నబియ్యాన్ని ప్రతి ఒక్క రేషన్ దారుడు తీసుకోవాలని సూచించారు.
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియని చెప్పారు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు శాగం పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్, దేవస్థాన కమిటీ చైర్మన్ శాగం నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.