కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వస్తయ్‌ : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వస్తయ్‌ :  ఎమ్మెల్యే  కుందూరు జైవీర్ రెడ్డి
  • నాగార్జునసాగర్ ఎమ్మెల్యే  కుందూరు జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు కచ్చితంగా పదవులు దక్కుతాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్  లో  డీసీసీ ఎన్నికపై మండల నాయకుల కార్యకర్తల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఏఐసీసీ సెక్రటరీ మహంతి బిశ్వాస్​ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి  కాంగ్రెస్ ను అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తను గుర్తించుకొని పార్టీ తగిన పదవిని కట్టబెడుతుందన్నారు. 

కార్యకర్తలు, నాయకులు పదవి రాలేదని అధైర్య పడొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ తో పని చేస్తుందని, గతంలో మాదిరిగా ఏకాభిప్రాయం ఉండదని పార్టీ కార్యకర్తల, శ్రేణుల అభిప్రాయాలను తీసుకుని ఎన్నిక జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కలువ సుజాత, ఎమ్మెల్సీ కేతా వత్ శంకర్ నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి, జడ్పీ మాజీ  వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ చైర్మన్ లు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి అంకత్ సత్యం పాల్గొన్నారు.