హాలియా, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని గిట్టుబాటు ధరను పొందాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల మండలం మారేపల్లి గ్రామంలో, కొత్తపల్లి పీఎసీఎస్ ఆధ్వర్యంలో, గుర్రంపోడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు 17 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని శుభ్రపరచుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి రూ.2,380 మద్దతు ధర పొందవచ్చు అని సూచించారు. సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ ను అందజేస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో తహసీల్దార్వై.రఘు, కొత్తపల్లి పీఏసీఎస్ చైర్మన్ రిక్కల మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, ఫాక్స్ జిల్లా అధికారి పత్యానాయక్, నాయకులు కుందూరు రాజేందర్ రెడ్డి, మాలే సత్యనారాయణరెడ్డి, మల్రెడ్డి భానుచందర్ రెడ్డి, డైరెక్టర్లు వెంకటయ్య, నాగయ్య, సిబ్బంది శంకర్, మట్టయ్య, మజహర్, నకిరేకంటి సైదులు, రైతులు సైదాబీ, బీమ్లా, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
