ఇంటింటికీ కాంగ్రెస్​ పథకాలను తీసుకెళ్లాలి : మదన్మోహన్

ఇంటింటికీ కాంగ్రెస్​ పథకాలను తీసుకెళ్లాలి : మదన్మోహన్

తాడ్వాయి,  వెలుగు : ప్రతి గ్రామంలో కాంగ్రెస్​ను బలోపేతం చేయాలని, ఇంటింటికీ కాంగ్రెస్​ పథకాలు తీసుకెళ్లాలని   ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.  మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో తాడ్వాయి మండలం ముఖ్య కార్యకర్తలు, నాయకులతో  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ..  రాబోయే ఎన్నికల్లో  ఇన్​చార్జిల పాత్ర కీలకం అన్నారు. 

వారి పని తీరువల్లే ఓట్లు పడతాయని చెప్పారు. బూత్​ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి  చేయాలని చెప్పారు.  పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామన్నారు.  కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకటరెడ్డి ఉపాధ్యక్షుడు జక్కుల రాజిరెడ్డి, యూత్ అధ్యక్షుడు అఖిల్ రావ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్ది మహేందర్ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు,మెట్టు రామచందర్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు