రామారెడ్డి లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

రామారెడ్డి లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సదాశివనగర్, వెలుగు : రామారెడ్డి మండల కేంద్రంలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం  ఎమ్మెల్యే మదన్మోహన్​రావు ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

 కార్యక్రమంలో కాంగ్రెస్​మండలాధ్యక్షుడు మొగుళ్ల ప్రవీణ్ గౌడ్, సదాశివనగర్ ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ వైస్​ చైర్మన్ అమ్ముల పశుపతి చారి, సొసైటీ డైరెక్టర్ లక్ష్మాగౌడ్, డైరెక్టర్లు రాహు, సత్యం, ల్యాగల ప్రసాద్​, శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్​ అధ్యక్షుడు గణేశ్​,  మహిళ అధ్యక్షురాలు అంజవ్వ తదితరులు పాల్గొన్నారు.