
దుబ్బాక, వెలుగు: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు తెలిపారు. శనివారం దుబ్బాక మండలం బొప్పాపూర్గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానిక పోచమ్మ గుడికి కావాల్సిన మెటీరియల్స్‌ను నిర్వాహకులకు ఎమ్మెల్యే ఉచితంగా అందజేశారు. గ్రామానికి చెందిన పర్స బాల్రాజం కుమార్తె, బోయ నర్సింలు తల్లి, అరిగె చిన్న యాదగిరి కుమారుడు చనిపోవడంతో వేర్వేరుగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సీఎంఆర్ఎఫ్చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్బాలమణి, బీజేపీ లీడర్లు అంబటి బాలేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
సంగారెడ్డి టౌన్, వెలుగు: విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని టీచర్ ఎమ్మెల్సీ నర్సారెడ్డి విమర్శించారు. శనివారం సంగారెడ్డిలో టీఎస్‌యూటీఎఫ్5వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ పార్క్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. హాజరైన నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం –2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువస్తుందని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల కొరత తీర్చకుండా నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు అందించాలంటే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్టేట్ ట్రెజరర్ లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
రోడ్డు మీద నాట్లేసి నిరసన
దుబ్బాక, వెలుగు: పెద్ద చెరువు లీకేజీకి రిపేర్చేయాలని డిమాండ్‌చేస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక-– లచ్చపేట రోడ్డుపై పారుతున్న నీటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్మాట్లాడుతూ ‘మిషన్‌కాకతీయ’ కింద ప్రభుత్వం దుబ్బాక పెద్ద చెరువుకు రిపేర్లు చేసిందని, కాంట్రాక్టర్లు పనులు సరిగ్గా చేయకపోవడంతో చెరువుకు లీకేజీ ఏర్పడి రోడ్డుపై పారుతున్నాయని వాపోయారు. దీంతో రోడ్డు గుంతలు పడడంతో పాటు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా చెరువు ను రిపేర్ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎండీ సాధిక్, భాస్కర్, ప్రశాంత్, చంద్, దిలీప్ పాల్గొన్నారు.
పీసీసీ జనరల్ సెక్రటరీగా ఎంఎ ఫయీమ్
సంగారెడ్డి, వెలుగు: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) జనరల్ సెక్రటరీగా సంగారెడ్డికి చెందిన ఎంఎ ఫయీమ్ నియామకమయ్యారు. శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పీసీసీ కొత్త కమిటీని ప్రకటించారు. కాగా ఫయీమ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నియామకమవ్వడం ఇది రెండోసారి కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.
చెన్నంగి ఆకులు తెంపిందని చెట్టుకు కట్టేసిన్రు
మెదక్, వెలుగు: మండలంలోని బాలనగర్లో శనివారం ఓ మహిళ చెన్నంగి ఆకులు తెంపిందని చెట్టుకు కట్టేశారు. రూరల్ ఎస్సై మోహన్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట యాదమ్మ తొక్కు నూరుకునేందుకని మన్నె శేకులు అనే వ్యక్తి ఇంటి పక్కన ఉన్న చెన్నంగి చెట్టు ఆకులు తెంపింది. దీంతో శేకులు, అతడి కొడుకు నాగరాజు ఆమెతో గొడవపడ్డారు. తమ చెట్టు ఆకులు ఎందుకు తెంపావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను చెట్టుకు కట్టేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారితో మాట్లాడి నచ్చ జెప్పి ఆమెను విడిపించారు. బాధితురాలి కంప్లైంట్మేరకు శేకులు, నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు
ఎస్సై తెలిపారు.
తోటపల్లి భూములు తిరిగివ్వాలి
కోహెడ(బెజ్జంకి)వెలుగు: తోటపల్లి భూములను రైతులకు తిరిగివ్వాలని మానకొండూర్బీజేపీ ఇన్చార్జి గడ్డం నాగరాజు డిమాండ్ చేశారు.శనివారం రైతులతో కలిసి బీజేపీ లీడర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ 2007లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల నుంచి 1,603 ఎకరాల భూమి తీసుకుందన్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. ఇందులో గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి 100 ఎకరాల భూమి పోగా.. మిగిలిన భూములను ప్రభుత్వం టీఎస్ఐఐసీకి ఇచ్చేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రైతులకు భూమి తిరిగి ఇచ్చే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండల అధ్యక్షుడు దోనె అశోక్,అనిల్‌రావు, వరుణ్‌రావు, రమేశ్, జ్యోతి, రైతులు ఉన్నారు.
‘చాకరిమెట్ల’లో భక్తుల సందడి
శివ్వంపేట మండలం చిన్నగొట్టి ముక్ల గ్రామ పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాద్‌నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి వారికి చందన పూజలు, అభిషేకం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆంజనేయశర్మ, ఈవో శ్రీనివాస్ భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. - వెలుగు ,మెదక్ (శివ్వంపేట)
ఇద్దరు స్వర్ణకారుల మృతి
మెదక్, వెలుగు: పట్టణంలో ఇద్దరు స్వర్ణకారులు శనివారం వేర్వేరుగా చనిపోయారు. ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా, మరొకరు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. స్థానిక పిట్లంబేస్ వీధికి చెందిన నార్సింగి వెంకటేశ్(41) స్వర్ణకారుడిగా పని చేస్తూ జీవించేవాడు. అయితే చేతినిండా పని దొరక్క ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మానసిక ఆందోళన గురై శనివారం స్థానిక పిట్లం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అదే వీధికి చెందిన మరో పేద స్వర్ణకారుడు ముండ్రాయి శ్రీనివాస్ (48) వారం రోజుల కింద బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యాడు. అతడిని చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైద్రాబాద్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రమేశ్ కోరారు.
చెన్నంగి ఆకులు తెంపిందని చెట్టుకు కట్టేసిన్రు
మెదక్, వెలుగు: మండలంలోని బాలనగర్లో శనివారం ఓ మహిళ చెన్నంగి ఆకులు తెంపిందని చెట్టుకు కట్టేశారు. రూరల్ ఎస్సై
మోహన్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట యాదమ్మ తొక్కు నూరుకునేందుకని మన్నె శేకులు అనే వ్యక్తి ఇంటి పక్కన ఉన్న చెన్నంగి చెట్టు ఆకులు తెంపింది. దీంతో శేకులు, అతడి కొడుకు నాగరాజు ఆమెతో గొడవపడ్డారు. తమ చెట్టు ఆకులు ఎందుకు తెంపావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను చెట్టుకు కట్టేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారితో మాట్లాడి నచ్చ జెప్పి ఆమెను విడిపించారు. బాధితురాలి కంప్లైంట్మేరకు శేకులు, నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
ఏపీజీవీబీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు న్యాయం చేయాలి
దుబ్బాక, వెలుగు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) లో పని చేస్తోన్న కాంట్రాక్ట్ఎంప్లాయీస్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై పోరాడాలని ఎంప్లాయీస్ ఎమ్మెల్యే రఘునందన్‌రావును కోరారు. శనివారం దుబ్బాక క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యేను కలిసి వినతి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తోన్న ఏపీజీవీబీ కాంట్రాక్ట్ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్‌చేయాలని 2014లో హైకోర్టు ఆర్డర్స్ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ బ్యాంక్ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు తీర్పునే అమలు చేయాలని ఆదేశించిందని చెప్పారు. ఇటీవల అవుట్సోర్సింగ్సంస్థకు అప్పజెప్పడానికి ఏపీజీవీబీ చైర్మన్, ఆర్ఎం, ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్యేతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వచ్చే అసెంబ్లీ మీటింగ్స్‌లో చర్చిస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. ఎండీ.ఆశమ్, ఆంజనేయులు, నాగరాజు, రాజు, నరేశ్ ఉన్నారు.
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలి
సిద్దిపేట, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడంతో ఆమెను వెంటనే అరెస్ట్ చేసి, పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిద్దిపేట జిల్లా నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ నవీన్ డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కూతురు కవితను కాపాడుకోవడంపై చూపే శ్రద్ధ నిరుద్యోగులపై చూపడంలేదని విమర్శించారు. తెలంగాణ ఖ్యాతిని దిగజార్చినందుకు కవిత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎంతటివారైనా శిక్ష తప్పదన్న కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె విషయం లో ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఉద్యోగ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలన్నారు. ఈ ఆందోళనకు బీజెపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, బీజెవైఎం అధ్యక్షుడు బి. సురేశ్‌గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాత బస్టాండు వద్ద ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌చేయాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
జహీరాబాద్ హోటల్లో ఫుడ్ పాయిజన్
జహీరాబాద్, వెలుగు: పట్టణంలోని ఓ హోటల్ లో భోజనం చేసిన 17 మందికి ఫుడ్పాయిజన్అయ్యింది. శుక్రవారం రాత్రి, శనివారం హోటల్ లో ఆహారం తిన్న వారికి వాంతులు, విరేచనాలు కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో ఎస్సై శ్రీకాంత్ హోటల్ వద్దకు చేరుకుని హోటల్‌ను సీజ్ చేయించారు.
పాతవారికే డీసీసీ పదవులు
మెదక్/గజ్వేల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల డీసీసీ ప్రెసిడెంట్లను లను మార్చిన కాంగ్రెస్హైకమాండ్మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పాత వారికే అవకాశం కల్పించింది. మెదక్, సిద్దిపేట జిల్లాల డీసీసీ ప్రెసిడెంట్లుగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, తూంకుంట నర్సారెడ్డిని కొనసాగిస్తూ ఏఐసీసీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా, జిల్లాలో క్షేత్ర స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు మరింత బాధ్యతగా పని చేస్తామన్నారు. టీపీసీసీ మెంబర్ ఆంజనేయులు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మల్లన్న సన్నిధిలో సౌకర్యాలు కల్పించాలి
కొమురవెల్లి, వెలుగు: మల్లన్న ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమవుతోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేశ్గౌడ్విమర్శించారు. శనివారం కొమురవెల్లి బీజేపీ మండల అధ్యక్షుడు దందాల వెంకట్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఉన్నా.. ఆలయంలో డెవలప్మెంట్పనులు చేయడం లేదన్నారు. భక్తులకు క్యూలైన్లలో సమస్యలు లేకుండా, మహిళలకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రాత్రి వేళ పడుకునేందుకు గుడారాలు ఏర్పాటు చేయాలని, కోనేటిలో శుభ్రమైన నీటిని ఉంచాలని డిమాండ్‌చేశారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు మీద నాట్లేసి నిరసన
దుబ్బాక, వెలుగు: పెద్ద చెరువు లీకేజీకి రిపేర్చేయాలని డిమాండ్‌చేస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక-– లచ్చపేట రోడ్డుపై పారుతున్న నీటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్మాట్లాడుతూ ‘మిషన్‌కాకతీయ’ కింద ప్రభుత్వం దుబ్బాక పెద్ద చెరువుకు రిపేర్లు చేసిందని, కాంట్రాక్టర్లు పనులు సరిగ్గా చేయకపోవడంతో చెరువుకు లీకేజీ ఏర్పడి రోడ్డుపై పారుతున్నాయని వాపోయారు. దీంతో రోడ్డు గుంతలు పడడంతో పాటు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా చెరువు ను రిపేర్ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎండీ సాధిక్, భాస్కర్, ప్రశాంత్, చంద్, దిలీప్ పాల్గొన్నారు.
పీసీసీ జనరల్ సెక్రటరీగా ఎంఎ ఫయీమ్
సంగారెడ్డి, వెలుగు: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) జనరల్ సెక్రటరీగా సంగారెడ్డికి చెందిన ఎంఎ ఫయీమ్ నియామకమయ్యారు. శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పీసీసీ కొత్త కమిటీని ప్రకటించారు. కాగా ఫయీమ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నియామకమవ్వడం ఇది రెండోసారి కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.