మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి : మందుల సామేల్ 

మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి : మందుల సామేల్ 

తుంగతుర్తి, వెలుగు : తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం పట్టణంలో చైర్మన్ చాగంటి అనసూయ రాములు అధ్యక్షతన మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీయూఎఫ్​ఐడీసీ కింద రూ.10 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రతి వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

జనాభా ప్రకారం పారిశుధ్య కార్మికులు 56 మంది ఉండాలని, కానీ ప్రస్తుతం 32 మంది ఉన్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు, రైన్ కోట్, ఆయిల్, సబ్బులు అందించాలని అధికారులకు సూచించారు. సుందరయ్య కాలనీలోని కస్తూర్బా గాంధీ పాఠశాల వరకు సీసీ రోడ్డు డ్రైనేజ్ కోసం ప్రత్యేకంగా కోటి రూపాయలు నిధులు కేటాయించామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, వైస్ చైర్మన్ సరళ, కౌన్సిలర్లు వై.నరేశ్, బత్తుల శ్రీను, జితేందర్, భాస్కర్, ప్రియాలత, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.