
గంగాధర, వెలుగు: ఎల్లంపల్లి నీటితో నారాయణపూర్ రిజర్వాయర్ నింపి, చొప్పదండి నియోజకవర్గంలోని చివరి మడి వరకు సాగునీరు ఇస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం గంగాధర మండలం మధురానగర్ క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రైతులు సాగునీటి కోసం ఆందోళనకు గురికావద్దన్నారు. ఎల్లంపల్లి నీటితో నారాయణపూర్ రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపాలని ఇరిగేషన్ సీఈని కోరినట్లు తెలిపారు. సాగునీటి విడుదలకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
టీచరే మార్గ నిర్దేశకుడు
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో టీచర్లది కీలకపాత్ర అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. టీచర్స్ డే సందర్భంగా మధురానగర్ మైనారిటీ గర్ల్స్ గురుకుల స్కూల్‌లో 22 మంది మండల స్థాయి ఉత్తమ టీచర్లకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషిచేస్తున్నట్లు చెప్పారు. ఎంఈవో ప్రభాకర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.