
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సేవల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌ను కోరారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సీఎండీని కలిసి వినతిపత్రం అందజేశారు.
గోదావరిఖని ఏరియా హాస్పిటల్‌లో రామగుండం ప్రాంతంలోని కార్మికులకే కాకుండా మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి ప్రాంతాల నుంచి సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవల కోసం వస్తున్నారని, హాస్పిటల్‌లో వైద్య సదుపాయాలను విస్తరించడం అత్యవసరమని సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.