రాముడి వనవాసం, ద్రౌపది వస్త్రాభరణం కంటే దారుణంగా.. జనగామ బీఆర్ఎస్లో కుట్రలు

 రాముడి  వనవాసం, ద్రౌపది వస్త్రాభరణం కంటే దారుణంగా.. జనగామ బీఆర్ఎస్లో కుట్రలు

బీఆర్ఎస్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో శ్రీరాముడి వనవాసం, మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం కంటే ఘోరంగా జనగామ బీఆర్ఎస్ లో రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఏ నియోజకవర్గంలో అయినా  ఎమ్మెల్యే ను కాదని మంత్రులు, ఇంకా ఎవరైనా సరే అడుగు పెట్టరాదని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత ఈ కుతంత్రాలు ఏంటి అని నిలదీశారు. 


గతంలో జనగామలో సమావేశం వద్దని వర్కంగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ వెనక్కి పంపించినా.. ఆయన ఆదేశాలు ధిక్కరించి సెప్టెంబర్ 29వ తేదీన  మీటింగ్ పెట్టుకున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మండిపడ్డారు.  తన బిడ్డ వల్లనే సీటు పోతుందని కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని.....కానీ ఆమెతో  పలికించే శక్తులు వేరే ఉన్నారని ఆరోపించారు. జనగామలో  బీఆర్ఎస్ పార్టీని వర్గాలుగా విడగొట్టి చెల్లాచెదురు చేస్తున్న వ్యక్తులను తీవ్రంగా హెచ్చరించారు. 

Also Read :- కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉండేది.. 90 రోజులే!

సీఎం కేసీఆర్ శరీరంలో  ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి ఒకరు అని... అలాంటి కేసిఆర్ వర్గాన్ని జనగామలో రెండు ముక్కలు చేశారని ముత్తి రెడ్డి మండిపడ్డారు.  ప్రజల కోసం నిర్మాణం చేసిన శాసనాలతో పాటు.. రాజ్యాంగానికి అడ్డుపడ్డ వ్యక్తులపై మాత్రమే ముత్తిరెడ్డి దురుసుగా వ్యవహరించాడు తప్ప ఏనాడు వ్యక్తిగతం కోసం పాకులాడలేదని స్పష్టం చేశారు.  జనగామ బీఆర్ఎస్ లో ఇప్పటివరకు ఒక్క కేసీఆర్ వర్గం తప్ప ఏ వర్గము లేదన్నారు. అలాంటిది ముత్తిరెడ్డి వర్గం అని చెప్పేటట్లు చేశారుని ఆవేదన వ్యక్తం చేశారు.

జనగామలో మరోసారి ఒక్క అవకాశం ఇవాలని.. ఇప్పటివరకు మిగిలిన పనులన్నీ పూర్తి చేసి జిల్లాకు ఒక ఆకృతి తీసుకువస్తానని  సీఎంను కోరడం జరిగిందన్నారు. ప్రజా సేవ చేయడమే తనకు తెలుసు అని.. వేషం భాష మార్చడం రాదని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు.