ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తా : మైనంపల్లి రోహిత్​రావు

ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తా : మైనంపల్లి రోహిత్​రావు

పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు, మాజీ ఎమ్మెల్యే  హన్మంతరావు మాటిచ్చారు. గురువారం  ఏడుపాయల వనదుర్గా మాతను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోహన్ రెడ్డి,  అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఈవో మోహన్​రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్​రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు దంపతులను శాలువాలతో  సత్కరించారు.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. మెదక్​ నియోజక వర్గంతో పాటు ఏడుపాయలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కమాన్​ నుంచి ఏడుపాయల వరకు డబుల్​రోడ్డుతో పాటు డివైడర్​ నిర్మిస్తామన్నారు.

వారివెంట కాంగ్రెస్ నాయకులు పుల్లన్నగారి ప్రశాంత్ రెడ్డి, పబ్బతి ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్,  మల్లప్ప, శెట్టి శ్రీకాంత్, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, బీసీ సెల్​జిల్లా ఉపాధ్యక్షుడు జంగం సతీశ్, నిటలాక్షప్ప, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, బాపురెడ్డి, రామాగౌడ్,రమేశ్​ గౌడ్, పార్శీ నర్సింలు, నరేందర్​గౌడ్, ప్రవీణ్ ఉన్నారు

నేడు క్యాంప్​ ఆఫీస్​కు ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్ టౌన్: మెదక్​ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసు నూతనంగా ముస్తాబవుతోంది. శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్​ రావు వచ్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పార్టీ నాయకులు, అధికారులు పూర్తి స్థాయిలో  ఏర్పాట్లు చేశారు. అనంతరం ముస్లిం, క్రిస్టియన్​ మతపెద్దలతో  సమావేశమవుతారు. మధ్యాహ్నం జిల్లా అధికారులతో సమీక్షా నిర్వహిస్తారు.