
దేవరకొండ(చింతపల్లి), వెలుగు: దేవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని అంగడి కుర్మపల్లిలో నిర్వహించిన శ్రీశ్రీ జగజ్జనని కాళికా మహాదేవి ఆలయ ముఖ ద్వారానికి శంకుస్థాపన చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఆలయాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. మాల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దొంతం అలివేలు, మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.