స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలి

దేవరకొండ, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సూచించారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో పీఏపల్లి, గుడిపల్ల, చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కులాల మధ్య చిచ్చు పెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. 

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ల అవినీతి బాగోతం బయటపడే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. చందంపేట మండలం చిత్రియాలా గ్రామ బీఆర్ఎస్ నాయకులు అంగోతు దస్రు నాయక్, రాజు, భారతి, లక్ష్మణ్, రమాల్ కాంగ్రెస్ చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు.