బెల్లాల్‌ చెరువులోకి నీటిని విడుదల చేయాలి

బెల్లాల్‌ చెరువులోకి నీటిని విడుదల చేయాలి
  •     ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి

బోధన్​, వెలుగు : వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి అన్నారు.  మంగళవారం  బోధన్​ పట్టణశివారులోని బెల్లాల్​ చెరువును సందర్శించారు.  చెరువులో నీరు ఏ స్థాయిలో ఉందో ఇరిగేషన్​ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి  సామర్థ్యం 930 అడుగులు ఉందని ఎండతీవ్రత పెరుగుతుండడంతో తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఎమ్మెల్యే నిజాంసాగర్​ ప్రాజెక్టు అధికారితో ఫోన్​లో మాట్లాడారు.  బోధన్​ పట్టణానికి తాగునీటి అవసరాల కోసం బెల్లాల్

 అలీసాగర్​ చెరువులోకి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.  బెల్లాల్​ చెరువుతో పాటుగా నిజామాబాద్​ జిల్లాలోని చెరువుల్లో గుర్రెపు డెక్క పెరిగిపోయిందని దీని నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకాడమిక్‌ చైర్మన్‌ తాహెర్‌‌ బిన్‌ హందాన్‌, టీపీసీసీ డెలిగేట్​ గంగాశంకర్​, కాంగ్రెస్​ పార్టీ  పట్టణ  అధ్యక్షుడు పాషామోయినోద్దిన్​, కాంగ్రెస్​ పార్టీ మండల  అధ్యక్షుడు  నాగేశ్వరరావ్​, కౌన్సిలర్లు శరత్ రెడ్డి, దామోదర్ రెడ్డి,  ధూలిపాలి పౌల్, నాయకులు ఇంద్రకరణ్,  సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.