
ముథోల్, వెలుగు: ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ ఉన్నత విద్యా మండలి చైర్మన్బాలకృష్ణారెడ్డిని కోరారు. ముథోల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆయన చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కాలేజీలో థర్డ్ ఇయర్ ప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని.. దానికి అనుగుణంగా లెక్చరర్, నాన్ టీచింగ్ ఉద్యోగులను నియమించాలన్నారు.
చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెద్దోళ్ల విఠల్, మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేశ్, మాజీ సర్పంచ్ అనిల్, నాయకులు ధర్మపురి సుదర్శన్, టి.రమేశ్, జీవన్, దశరథ్, నాగేశ్ తదితరులున్నారు.